ముంచంగిపుట్టు మండలంలోని భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు శుక్రవారం మధ్యాహ్నం సమయంలో వాతావరణంలో ఆకస్మికంగా మార్పులు ఏర్పడి ఆకస్మిక భారీ వర్షం కురవడంతో ఉపశమనం లభించింది. రెండు గంటలపాటు కురిసిన భారీ వర్షానికి వాహనచోదకులు పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ తడచి ముద్దాయ్యాయి. పలు మారుమూల గ్రామాల్లో మట్టి రోడ్లు బురదమయమయ్యాయి.