ముంచంగిపుట్టు మండలంలో శుక్రవారం ప్రమాదం జరిగింది. మండలంలో బిరిగుడలో వంతెన నిర్మాణం జరుగుతుంది. సంగంవలసకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నందు వంతెనకు నీళ్లు తడిపేందుకు ట్యాంకర్లో నీళ్లు తీసుకెళ్తుండగా బిరిగుడలో ట్రాక్టర్ ఇంజన్ ఆపకుండా గేర్లో ఉంచడంతో ట్రాక్టర్ అదుపు తప్పింది. ట్రాక్టర్ అదుపు చేయలేక కిందకి పడిపోవడంతో వెనక చక్రాలు నందు పైనుంచి వెళ్ళగా అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.