చెక్ డ్యాంకు మరమ్మతులు చేపట్టాలని వినతి

83చూసినవారు
చెక్ డ్యాంకు మరమ్మతులు చేపట్టాలని వినతి
పెదబయలు మండలంలోని గోమంగికుమ్మరవీధిలో ఉన్న చెక్ డ్యాంకు మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తుడు ధనుంజయ మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చెక్ డ్యాం కొట్టుకుపోయి కోతకు గురైందన్నారు. దీనితో సుమారు 80 ఎకరాల పంట పొలాలకు సాగు నీరు అందడం లేదన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ చెక్ డ్యాంకు మరమ్మతులు చేపట్టి గిరి రైతులను ఆదుకోవాలని శుక్రవారం ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్