చొంపి గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

77చూసినవారు
చొంపి గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు
అరకులోయ మండలంలోని చొంపిలో శుక్రవారం పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేసిన మట్టి చెత్తాచెదారాలను తొలగించే పనులను పంచాయతీ కార్మికులు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. చెత్తాచెదారాలను మురుగు కాలువల్లో వేయకుండా డస్ట్ బిన్లలో వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్