తారు రోడ్డు నిర్మించాలని గిరిజనుల నిరసన

58చూసినవారు
అరకులోయ మండలంలోని పుచలి గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని గిరిజనులు గురువారం నిరసనలు వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ 2022లో ఇంటింటికి చందాలు వేసుకుని సొంతంగా నిర్మాణం చేపట్టిన మట్టిరోడ్డు కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోయి అద్వానంగా తయారైందన్నారు. దీనితో అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు గ్రామంలో కనీసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. రహదారి సమస్యపై అధికారులు స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్