వడ్డాది వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరి చెక్కలు, తలనీలాలు పోగు చేసుకునేందుకు ఈనెల 7న ఆలయం వద్ద బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో టీఎన్ఎస్ శర్మ తెలిపారు. ఈ నెల 9 నుంచి 15 వరకు కొబ్బరి చిప్పలు, మార్చి 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు తలనీలాలు పోగు చేసుకునేందుకు వేలం నిర్వహిస్తామన్నారు. వేలంలో పాల్గొనేవారు కొబ్బరి చిప్పలకు రూ. 30, 000, తలనీలాలకు రూ. 20, 000 డిపాజిట్ చెల్లించాలన్నారు.