బుచ్చయ్యపేట మండలం కె పి అగ్రహారం గ్రామంలో జొన్నపల్లి సాయప్ప కోళ్ల పారం నిర్వహిస్తున్నాడు, కోళ్లకు ఎప్పటివలే మంగళవారం కూడా నీరు, మేత అందించాడు. సాయంత్రం వచ్చి చూసే సరికి 100 కోళ్లు మృతి చెంది ఉన్నాయని.. ప్రభుత్వం ఆదుకోవాలని సాయప్ప కోరుతున్నాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానిక సర్పంచ్ గోపి శెట్టి శ్రీనివాసరావు సాయప్ప ను పరామర్శించి, కోళ్లను పరిశీలించారు.