చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా మంగళవారం కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఐవి వి సత్యవతి పాల్గొని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్యాన్సర్ గురించి అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు.