కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతాంగానికి ముందు చెయ్యి చూపించిందంటూ నిరసన తెలుపుతూ బుధవారం చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో రైతాంగానికి పూర్తిగా మొండిచేయి చూపారని రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.