చోడవరం: ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

54చూసినవారు
చోడవరం: ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
చోడవరం మండలం అడ్డూరు సమీపంలో ప్రెసిడెంట్ ఎస్టేట్స్ ప్రాంతంలో ఆదివారం ఉషోదయ డిగ్రీ కళాశాలలో 2004- 2007 వరకు బీఏ చదివిన విద్యార్థులు సుమారు 60 మంది వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చి ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు అభిమానంగా పలకరించుకుంటూ వారి గత స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ఉషోదయ విద్యాసంస్థల్లో నాడు పనిచేసిన అధ్యాపక వర్గాన్ని సత్కరించుకున్నారు.

సంబంధిత పోస్ట్