చోడవరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం 48వ వార్షికోత్సవం వాసవి యూత్ క్లబ్, దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం అమ్మవారికి, ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూలలంకరణ చేశారు. అమ్మవారి తిరువీధి ఉత్సవo 102 రకాలతో, 102 పసుపు కొమ్ముల కలశాలతో అమ్మవారికి ప్రత్యేకంగా ఊరేగింపు నిర్వహించారు.