చోడవరం: మస్తర్లు ఆన్ లైన్ లో డిలీట్ చేసిన వ్యక్తిపై చర్యకు డిమాండ్

61చూసినవారు
చోడవరం: మస్తర్లు ఆన్ లైన్ లో డిలీట్ చేసిన వ్యక్తిపై చర్యకు డిమాండ్
రావికమతం మండలం మరుపాక వెలగబంద చెరువు పనుల్లో పాల్గొన్న వేతనదారుల మస్తర్లను మాయం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మరుపాక ఎంపిటిసి ముచ్చ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం రావికమతం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పైలరాజు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ గతనెలలో వెలగబంద చెరువులో సుమారు 140 మంది వేతన దారులు ఆరు రోజులు పనులు పాల్గొన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్