అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు బుధవారం చోడవరం మండలంలో దుడ్డుపాలెం, గవరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల భయం లేకుండా ఎలా ఉండాలో తెలియజేయడంతో పాటు, పదవ తరగతి వంద రోజుల ప్రణాళికా అమలును పరిశీలించారు. ఇటీవల జరిగిన ఫార్మేటివ్ -3 పరీక్షల ప్రగతిని పరిశీలించి వెనుకబడిన విధ్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు