మాజీ ప్రభుత్వ విప్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 56వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ధర్మశ్రీ స్వగృహంలో పార్టీ శ్రేణులు, సాలువ గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే చోడవరం పార్టీ కార్యాలయంలోకూడా భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు ధర్మశ్రీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.