డుంబ్రిగుడ: ఆవును ఢీ కొట్టిన ఆటో

50చూసినవారు
డుంబ్రిగుడ: ఆవును ఢీ కొట్టిన ఆటో
డుంబ్రిగుడ మండలంలో బుధవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కించుమండ వారపు సంతకు వెళ్లి డుంబ్రిగుడ వైపు తిరిగి వస్తున్న ఆటో..  బాలుర ఆశ్రమ పాఠశాల వద్ద ఓ ఆవు ఎదురుగా రావడంతో ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడగా ఆవు అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్