చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ ఎం ఎస్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ కళాశాల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ ఆవశ్యకతను వివరించారు.