మాజీ ప్రభుత్వ విప్, చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 56 వ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. బుచ్చెయ్యపేట మండలం నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు గాజువాకలోని అయన స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పంచాయతీరాజ్ వింగ్ ఉపాధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షుడు జోగా కొండబాబు ధర్మశ్రీ కి గజమాల వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు.