రథసప్తమి సందర్భంగా శ్రీనివాస యోగా లైఫ్ స్కిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో చోడవరం వాసవియూత్ క్లబ్ ఆధ్వర్యంలో సామూహికసూర్య నమస్కారాల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమo యోగాగురువు, యూత్ క్లబ్ ట్రెజరర్ అర్రేపు శ్రీనివాస్ నిర్వహణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోన్ చైర్మన్ కొల్లూరు మణికుమార్, సీఎంఆర్ ఇన్చార్జ్ సత్యవరపు శ్రీనివాస్, క్లబ్ ప్రెసిడెంట్ పెన్నం రాజు పాల్గొన్నారు.