పెదబయలు మండలంలోని గుల్లేలు పంచాయతీలో శుక్రవారం సర్పంచ్ సత్యాలమ్మ ఆధ్వర్యంలో పెసా కమిటీ ఎన్నిక జరిగింది. పెసా కమిటీ అధ్యక్షుడిని తిరుపతిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోగా కార్యదర్శిగా రాజంనాయుడుని ఎన్నుకున్నారు. అధ్యక్షుడు తిరుపతిరావు మాట్లాడుతూ. గిరిజన హక్కులు చట్టాల పరిరక్షణ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో. మాజీ ఎంపీటీసీ భాస్కరరావు సూపర్ సర్పంచ్ జమ్మనాయుడు పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.