నూతన హై స్కూల్ కమిటీ చైర్మన్ వెంకటరమణ కు ఘన సత్కారం

74చూసినవారు
నూతన హై స్కూల్ కమిటీ చైర్మన్ వెంకటరమణ కు ఘన సత్కారం
బుచ్చయ్యపేట మండలం వడ్డాది పంచాయతీ పరిధిలో స్థానిక కెఏడి జెడ్పీ హైస్కూల్ కి నూతన కమిటీ చైర్మన్ గా కోవెల వెంకటరమణ, వైస్ చైర్మన్ పి. అనూష ఏకగ్రీవంగా శనివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని స్థానిక పట్టణ టిడిపి అధ్యక్షులు దొండా నరేష్, ఉపాధ్యక్షులు సింగంపల్లి రమేష్ యాదవ్, బంగారుమెట్ట మాజీ సర్పంచ్ తమరాన సింహాద్రి అప్పన్న(దాసు) వారిని పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్