భోగి మంటలను తారు రోడ్లపై వేయవద్దని విశాఖ జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ శుక్రవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ నిధులతో నగర ప్రజల సౌకర్యార్థం వేసిన రోడ్లపై భోగిమంటలు వేయడం ద్వారా రోడ్లపై తారు కరిగి రోడ్లపై గుంతలు ఏర్పడడంతో నగర సుందరీకరణ కోల్పోవడమే కాకుండా, జివిఎంసికి ఆర్ధిక నష్టం వాటిల్లుతుందన్నారు.