
ఇంటర్ విద్యలో సంస్కరణలు.. కొత్త కోర్సుకు అనుమతి
AP: 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ క్యాలెండర్లో మార్పులు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. "ఇక నుంచి జూన్ 1కు బదులు ఏప్రిల్ 1 నుంచే కళాశాలలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 7 నుంచే ఇంటర్ తొలి ఏడాది ప్రవేశాలుంటాయి. ఇంటర్లో మ్యాథ్స్ ఏ, బీ.. ఒకే సబ్జెక్ట్గా, బోటనీ-జువాలజీని ఒకే సబ్జెక్ట్గా చేస్తాం. జూనియర్ కాలేజీల్లో ఎం.బైపీసీ కోర్సుకు అనుమతి ఇచ్చాం." అని మంత్రి తెలిపారు.