విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ పై కూటమి పాలకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి. ఆదినారాయణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కూర్మ న్న పాలెం కూడలిలో చేపడుతున్న రిలే దీక్షలు శుక్రవారం 1, 429 వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరం లో ఉద్యోగులు పాల్గొన్నారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆదినారాయణ మాట్లాడారు.