విగ్రహానికి ముసుగు తొలగించాలి

66చూసినవారు
విగ్రహానికి ముసుగు తొలగించాలి
గాజువాక సమీంలోని పెద్దగంట్యాడ మండలం నడుపూరు బర్మా కాలనీలో ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సార్వత్రిక ఎన్నికల కోడ్ సందర్భంగా వేసిన ముసుగును ఇంకా తొలగించకపోవడంపై వివిధ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసి 20 రోజులు దాటుతున్న ఇంకా ముసుగు ఎందుకు తీయలేదని వీరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు స్పందించి ముసుగు తొలగించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్