విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గురువారం పరిశీలించారు. ఉక్కుకర్మాగారానికి అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తామని హామీ మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. కర్మాగారంలో ఉక్కు ఉత్పాదన ప్రాసెస్‌పై ఆసక్తిని కనబరిచారు. స్టీల్ సీఎండీ అతుల్ భట్ ప్లాంట్ పనితీరును వివరించారు.