మాడుగుల మండలం సత్యవరం గ్రామంలో అలముకున్న చీకటిని విద్యుత్ అధికారులు అప్రమత్తమై 24 గంటల్లో వెలుగునిచ్చారు. ఈనెల 15న సాయంత్రం పెద్ద ఎత్తున కురిసిన గాలి వర్షాలు మూలంగా గ్రామంలో గల అనేక చోట్ల చెట్లు 27 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో శుక్రవారం సాయంత్రం వరకు గ్రామంలో చీకటి అలుముకుంది. తహశీల్దార్ రమాదేవి తో పాటు విద్యుత్తు అధికారులు సందర్శించారు.