మాడుగులలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ పివిరత్నం ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పతాకావిష్కరణ చేశారు. అలాగే స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్దకూడా ఎమ్మెల్యే బండారు పతాకావిష్కరణ చేశారు. మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద కూడా ఎమ్మెల్యే పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించారు.