శ్రావణమాసం రెండో వారం పూజలు మహిళలంతా భక్తిశ్రద్ధలతో శుక్రవారం జరుపుకున్నారు. సహజంగా ఈ మాసంలో వచ్చే రెండో శుక్రవారం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి గృహంలోనూ మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల మహా నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తారు. దానిలో భాగంగానే శుక్రవారం కూడా మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కేజేపురం సంతోషి మాత ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.