మాడుగుల, చీడికాడ మండలంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏం కోడూరు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో లక్ష్మీపేట గ్రామ పాఠశాలలో, చీడికాడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డి సురవరం, వాకపల్లి, పాఠశాలలో విద్యార్థులకు వాసవి క్లబ్ వారు పుస్తకాలు, పెన్నలు, మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే కింతలి గాదిరాయి, వీరవల్లి రూరల్, కేజే పురంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.