ఉత్తమ పంచాయతీగా జాతీయస్థాయి అవార్డు పొందిన మాడుగుల మండలం వీరవల్లి పంచాయతీ సర్పంచ్ ఎలగాడ కామ లక్ష్మి ఈశ్వరరావులను మంగళవారం మాడుగుల మానస సంస్థ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వి పరమేశ్వర రావు సిబ్బంది సర్పంచ్ ను సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలలో 90 శాతం పథకాలు ఈ పంచాయతీ అమలు చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు.