మాడుగుల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, క్రమశిక్షణ గల నాయకునిగా గుర్తింపు పొందిన వి జె పురం గ్రామానికి చెందిన గూడెపూ హరికృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ శనివారం అయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడని ఫలితంగా అతని భార్య సర్పంచ్ గా పనిచేసి, ప్రస్తుతం ఎంపీటీసీగా పనిచేస్తున్నారని చెప్పారు.