మాడుగులలో రేపు మినీ మహానాడు

50చూసినవారు
మాడుగులలో రేపు మినీ మహానాడు
మాడుగుల మండలం ఎం కోటపాడు చెరకు కాటా వద్ద ఈనెల 19న నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు నిర్వహించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం మహానాడుకు ముందు అన్ని నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించి కార్యకర్తలను నాయకులు చైతన్యవంతం చేసేందుకు మినీ మహానాడు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా భారత సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్