ప్రారంభమైన సంతోషిమాత దీక్షలు

57చూసినవారు
ప్రారంభమైన సంతోషిమాత దీక్షలు
మాడుగుల మండలం కేజే పురం జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ సంతోషి మాత ఆలయంలో శుక్రవారం నుంచి నవరాత్రి దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు కాళ్ల అమ్మ తల్లి నాయుడు ఆధ్వర్యంలో మొత్తం 45 మంది భక్తులు సంతోషిమాత మాలలు ధరించారు. ప్రతి ఏడాది శ్రావణమాసం రెండో శుక్రవారం మాలలు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. దానిలో భాగంగానే ఈ ఏడాది కూడా శుక్రవారం మాలలు ధరించారు. తొమ్మిది రోజులు దీక్ష కొనసాగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్