మాడుగుల గ్రామంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు శనివారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్థల పరిశీలన జరిపారు. స్థానిక దుర్గాల అమ్మవారి ఆలయ పరిధిలో గల పాత వెలుగు కార్యాలయం స్థలాన్ని పరిశీలించారు. బస్టాండ్ కు దగ్గరగా ఉంది కాబట్టి ఈ స్థలం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న పేదవారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా అందుబాటులో ఉంటుందన్నారు.