ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర(సాస) కార్యక్రమంలో భాగంగా శనివారం మాడుగుల మండలం పోతనపూడి, జీ అగ్రహారం గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మండల ప్రత్యేక అధికారి కె వీరమనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలో జరుగుతున్న వివిధ పారిశుధ్య కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అలాగే సచివాలయాలు సందర్శించారు. నీటి కుండీలను, సంపద తయారీ షెడ్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.