నర్సీపట్నం వేములపూడి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ గురుకుల పాఠశాలలో మిగులు సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ శాంతి తెలిపారు. గురువారం పాఠశాలలో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపిసి గ్రూపులో 8 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థినులకు హాస్టల్ వసతి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.