శ్రీకాకుళంలో ఈనెల 22వ తేదీన జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను గురువారం గొలుగొండ మండలం కృష్ణదేవి పేటలో ఆవిష్కరించారు. ఏఐవైఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు రాధాకృష్ణ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లౌకిక రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలన్నారు.