గొలుగొండ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారి డాక్టర్ శ్యాంకుమార్ ఆద్వర్యంలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారి అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ఓ ప్రసాద్, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.