గొలుగొండ: గ్రామకంఠం స్థలాలను కాపాడాలి

55చూసినవారు
గొలుగొండ: గ్రామకంఠం స్థలాలను కాపాడాలి
గ్రామకంఠం స్థలాలు కాపాడాలని గొలుగొండ మండలం పాకలపాడు మాజీ సర్పంచ్ కామిరెడ్డి రామన్న కోరారు. శుక్రవారం గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో తహశీల్దార్ పీ. శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. రామన్న మాట్లాడుతూ గ్రామ కంఠ స్థలాలే కాకుండా ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమణ గురయ్యాయన్నారు. ఈ ఆక్రమణల నుంచి ఈ స్థలాలను, చెరువులను కాపాడాలని కోరారు. టీడీపీ నాయకులు కిల్లాడి వెంకటరమణ, సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్