నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డేపల్లి ఆర్సీఎం పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు శనివారం సమావేశం అయ్యారు. 2023 సంవత్సరంలో పాఠశాల మూతపడిన నేపథ్యంలో 1969 సంవత్సరం నుండి 1994 విద్యా సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకున్నారు. ఆర్. సి. యం పాఠశాల పూర్వ వైభవం తెచ్చే విధంగా ఏప్రిల్ ఒకటో తారీఖున సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.