నర్సీపట్నం: నాటుసారా స్థావరాలపై దాడులు

81చూసినవారు
నర్సీపట్నం: నాటుసారా స్థావరాలపై దాడులు
నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పీ. రాజారావు, సిబ్బంది గురువారం నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 3వేల లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేయడంతో పాటు సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని ధ్వంసం చేశారు. ఎక్కడైనా నాటుసారా అమ్మకాలు, తయారీ జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్