నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ ఉద్యోగి మృతి

76చూసినవారు
నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ ఉద్యోగి మృతి
నర్సీపట్నంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ ఉద్యోగి మృతి చెందాడు. కొయ్యూరు మండలం మర్రిపాక సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తున్న ఆర్. పొట్టన్న విధులకు బయలుదేరే క్రమంలో నర్సీపట్నం కృష్ణాపేలస్ వద్ద ఆర్టీసి బస్సు ఢీకొట్టింది. దీంతో ఆర్టీసి బస్సు వెనుక చక్రాలు ఆయనపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి టౌన్ సీఐ గోవిందరావు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు

సంబంధిత పోస్ట్