నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలపై శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ మున్సిపాల్టీలో వాటర్ సప్లై సెక్షన్లో పని చేస్తున్న ఉద్యోగులకు జీవో ఆధారంగా జీతాలు చెల్లించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఎపి మున్సిపల్ ఎంప్లాయిష్ & వర్కర్స్ పెడరేషన్ (సిఐటియు ) అధ్యక్షులు అప్పలనాయుడు, మహేష్, మదు, పాల్గొన్నారు.