నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు రీ వెరిఫికేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగానికి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు వెరిఫికేషన్ మొదలుపెట్టారు. ఆర్థోపెడిక్ డాక్టర్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో లబ్ధిదారులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లబ్ధిదారుల అంగవైకల్యాన్ని తనిఖీ చేసి నమోదు చేస్తున్నారు.