నర్సీపట్నం: పేకాట శిబిరంపై పోలీసులు దాడి

51చూసినవారు
నర్సీపట్నం: పేకాట శిబిరంపై పోలీసులు దాడి
నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామ శివారులో శుక్రవారం పేకాట శిబిరంపై దాడి చేసినట్లు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పీ. రాజారావు తెలిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 5040 నగదు స్వాదీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట, కోడిపందాలు వంటివి నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్