వెలుగు అధికారులు, బ్యాంకర్స్ తో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నర్సీపట్నంలో సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా గ్రూపుల సభ్యులు తీసుకుంటున్న రుణాలు వారికి ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటున్నాయో అడిగారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వెలుగు డిపార్ట్మెంట్, బ్యాంకర్లు సమన్వయంతో డ్వాక్రా గ్రూప్ సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చూడాలన్నారు.