నాతవరం మండలంలో తాండవ జలాశయాన్ని ఆ ప్రాజెక్టు ఛైర్మన్ కరక సత్య నారాయణ గురువారం సందర్శించారు. ముందుగా ఆయన జలాశయం వద్ద గల శ్రీనల్లగొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులతో సమావేశమై జలాశయ అభివృద్ధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ బాలశౌరి, డీఈ అనురాధ, ఏఈ ప్రేమ్ కుమార్, శ్యామ్తో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.