నర్సీపట్నం టౌన్ పరిధిలో శుక్రవారం ఉదయం స్పెషల్ డ్రైవ్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ గోవిందరావు ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ చేసిన సుమారు 45 వాహనదారులను గుర్తించారు. వారిని స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనల ఉల్లంఘనల వలన జరిగే ప్రమాదాలను వివరించారు. భవిష్యత్తులో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.