నర్సీపట్నం: రావణపల్లి జలాశయ పూడికతీత పనులు ప్రారంభం

74చూసినవారు
నర్సీపట్నం: రావణపల్లి జలాశయ పూడికతీత పనులు ప్రారంభం
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 10 లక్షల రూపాయలతో రావణాపల్లి రిజర్వాయర్ ప్రధాన కాలువ పూడికతీత పనులను స్పీకర్ అయ్యన్న తనయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల రాజేష్ శనివారం ప్రారంభించారు. రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షులు రుత్తల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సభ్యులు, నర్సీపట్నం పురపాలక కౌన్సిలర్లు ధనిమిరెడ్డి మధు, లాలం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్