నర్సీపట్నం: సంక్రాంతి తీర్థ మహోత్సవాల్లో స్పీకర్ అయ్యన్న

61చూసినవారు
నర్సీపట్నం: సంక్రాంతి తీర్థ మహోత్సవాల్లో స్పీకర్ అయ్యన్న
నర్సీపట్నం శివపురంశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 26వ సంక్రాంతి తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆయన సతీమణి చింతకాయల పద్మావతి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. మహోత్సవానికి హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ని ఆలయ కమిటీ సభ్యులు పైల గోవిందు, వార్డు కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు, దానిమిరెడ్డి బుజ్జి తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్